ఫేస్‌బుక్ ఇకపై మరింత ప్రైవసీబుక్‌గా మారనుందట...

మోహన్| Last Updated: గురువారం, 7 మార్చి 2019 (18:26 IST)
ఆన్‌లైన్ సోషియల్ నెట్‌వర్కింగ్‌లో ఫేస్‌బుక్ ఒక వెలుగు వెలుగుతోంది. ఫేస్‌బుక్ సంస్థ త్వరలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానుంది. ఫేస్‌బుక్ ద్వారా జరిగే అన్ని సంభాషణలను విభిన్న రీతిలో ఎన్‌క్రిప్ట్ చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తోంది. ఈ ఐడియాను ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా తన బ్లాగులో పోస్ట్ చేసాడు. 
 
సురక్షితమైన మెసెంజింగ్ సర్వీసులు భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందుతాయని జుకర్‌బర్గ్ అంచనా వేస్తున్నాడు. ఓపెన్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే కూడా గోప్యత(ప్రైవసీ) ఎక్కువ ఆదరణ పొందుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఫేస్‌బుక్‌కి చెందిన న్యూస్ ఫీడ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గురించి కానీ జుకర్‌బర్గ్ ఎలాంటి నిర్ణయాలను వెల్లడించలేదు. 
 
భవిష్యత్తులో వినియోగదారులు ప్రైవసీ ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లతో కమ్యూనికేట్ చేసుకుంటారని తెలిపాడు. ఇందుకోసం ఫేస్‌బుక్‌ని ప్రైవసీ ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.దీనిపై మరింత చదవండి :