శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 30 జనవరి 2018 (12:21 IST)

ఫిబ్రవరి 1 నుంచి మోటోరోలా మోటో ఎక్స్ 4 రిలీజ్

మోటోరోలా సంస్థ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ''మోటో ఎక్స్ 4'' విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అంశాలున్నాయి. ఇప్పటికే మోటో ఎక్స్ 4 రెండు రకాలుగా మార్కెట్లలో లభ్యమవు

మోటోరోలా సంస్థ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ''మోటో ఎక్స్ 4'' విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అంశాలున్నాయి. ఇప్పటికే మోటో ఎక్స్ 4 రెండు రకాలుగా మార్కెట్లలో లభ్యమవుతున్నాయి.

వీటిలో 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 4జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ కలిగిన ఫోన్లు మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. ఇక తాజా మోటో ఎక్స్ 4 రెండు సిమ్ కార్డులతో పనిచేస్తూ.. 424పీపీఐ, 1080x1920 పిక్సల్ కలిగిన 5.20 ఇంచ్‌, హెచ్డీ ఎల్టీపీఎస్ ఫుల్ డిస్ ప్లే కలిగి వుంటుంది. 
 
ఫీచర్స్ :
టచ్ స్క్రీన్
బరువు- 163 గ్రాములు  
3000 ఎఎమ్‌హెచ్ బ్యాటరీ సామర్థ్యం 
కలర్స్ - సూపర్ బ్లాక్, స్టెర్లింగ్ బ్లూ
ఫ్లాష్ కెమెరా, 
బ్యాక్, ఫ్రంట్ కెమెరా 
బ్లూటూత్ 
3.5మి.మి ఆడియో జాక్ 
3జీ, 4జీ ఎల్టీఈ మైక్రో-యూఎస్‌బీ