ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (15:04 IST)

గూగుల్ క్రోమ్ నుంచి కొత్త ఫీచర్: పాస్ కీ వచ్చేస్తోందిగా..

gogole chrome
గూగుల్ క్రోమ్ నుంచి కొత్త ఫీచర్ రానుంది. ఇకపై క్రోమ్ బ్రౌజర్ నుంచి సైట్ల సందర్శించే సమయంలో పాస్ వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందుకు వీలుగా గూగుల్ పాస్ కీస్‌ను ప్రవేశపెట్టింది. 
 
పాస్ కీ అనే ప్రతి యూజర్‌కు ప్రత్యేకమైన ఐడెంటీటీతో కూడుకుని వుంటుందని.. కంప్యూటర్లు, ఫోన్లు, యూఎస్‌బీ, సెక్యూరిటీ డివైజ్‌లలోనే స్టోర్ అవుతాయి. తద్వారా ఆన్‌లైన్‌లో ఎక్కడా స్టోర్ కావు. పాస్వర్డ్ ఇతరులకు తెలిస్తే నష్టం తప్పదు. 
 
కానీ పాస్వర్డ్ కీస్ మరొకరికి తెలిసే అవకాశం వుండదు. సర్వర్ బ్రీచ్ అయినా.. ఈ పాస్‌వర్డ్ కీస్ లీక్ కావు. అలాగే సైబర్ దాడుల నుంచి యూజర్లకు రక్షణ వుంటుందని గూగుల్ బ్లాగులో పోస్టు చేసింది. 
 
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్యాటర్న్, పిన్ ద్వారా మనం ఫోన్ లో లాగిన అయినట్టుగా, పాస్ కీస్ సాయంతో ఆన్ లైన్ పోర్టళ్లలో లాగిన్ అయ్యేందుకు వీలుంటుందని గూగుల్ తెలిపింది.