సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (14:38 IST)

అందుబాటులోకి వన్ ప్లస్ నుంచి 10టీ 5జీ ఫోన్

10t5g mobile
దేశీయ స్మార్ట్ ఫోన్ మొబైల్ మార్కెట్‌లో వన్ ప్లస్ 10టి 5జీ స్మార్ట్ ఫోన్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో సరికొత్త ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, సోని ఐఎంఎక్స్ 769 కెమెరా, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 
 
రెండేళ్ల తర్వాత టీ సిరీస్‌లో వన్ ప్లస్ నుంచి మొబైల్ రావడం ఇదే తొలిసారి. రెండేళ్ల క్రితం వన్ ప్లస్ 8టీని విడుదల చేసిన విషయం తెల్సిందే. ఇపుడు వన్ ప్లస్ 10టిని విడుదల చేశారు. ఇందులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులోని అలర్ట్ స్లైడర్‌ను తొలగించడం జరిగింది.
 
అయితే, ఈ ఫోన్ మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. ఈ ఫోను ధరలను పరిశీలిస్తే, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా ఉంండగా, 12 జీబీ ర్యామ్, +256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999, ఇక హైఎండే వేరియంట్ 16 జీబీ ర్యామ్, +256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.55,999గా ఉంది. 
 
ఈ ఫోన్ ఈ నెల ఆరో తేదీ నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయి. జెడ్ గ్రీన్, మూన్‌స్టోన్ బ్లాక్ కలర్స్‌లలో కూడా లభ్యంకానుంది. బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే రూ.5 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అంటే మొబైల్ అసలు ధర నుంచి ఈ మొత్తాన్ని తగ్గించనున్నారు.