మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (17:03 IST)

ప్రపంచంలోనే 5జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల

ప్రపంచంలోనే 5జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో తొలి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. లెనోవా అనుబంధ సంస్థ మోటోరోలా నుంచి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఇందుకోసం కంపెనీ 5జీ మోటో మోడ్‌ని కూడా ప్రకటించింది. చికా

ప్రపంచంలోనే 5జీ నెట్‌వర్క్ సపోర్ట్‌తో తొలి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. లెనోవా అనుబంధ సంస్థ మోటోరోలా నుంచి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలైంది. ఇందుకోసం కంపెనీ 5జీ మోటో మోడ్‌ని కూడా ప్రకటించింది. చికాగో మోటో జెడ్ పేరిటన విడుదలైన ఈ ఫోన్‌ను 5జీ నెట్‌వర్క్‌కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం వుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌‌‌సెట్‌ ప్రాసెసర్‌ను ఈ ఫోన్ కలిగివుంటుంది. 
 
వినియోగదారులకు పలు ఆకట్టుకునే ఫీచర్లతో దీనిని మోటారోలా విడుదల చేసింది. ఈ ఫోన్ ధర మనదేశంలో దాదాపు రూ.33వేల వరకు వుంటుందని సంస్థ వెల్లడించింది. ఈ ఫోను అమెరికాలో ఆగస్టు 16వ తేదీ నుంచి విక్రయిస్తారు. ఆపై భారత్ మార్కెట్లోకి ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
మెమొరీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకునే సౌకర్యం వుంది. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 1080x2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ వెనక భాగంలో రెండు 12 /12 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, టర్బో పవర్ సపోర్ట్‌తో కూడిన 3000ఎంఏహెచ్ బ్యాటరీని ఇది కలిగివుంటుంది.