సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (20:17 IST)

దేశంలో తొలి యూపీఐ ఏటీఎం లాంఛ్

దేశంలో తొలి యూపీఐ ఏటీఎం లాంఛ్ అయ్యింది. ముంబైలోని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టులో ఇది లాంఛ్ అయ్యింది. దీనిద్వారా కార్డు అవసరం లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్‌ని ప్రోత్సహించేందుకు ఈ ఏటీఎంను రూపొందించారు. 
 
ఈ ఏటీఎంలో యూపీఐ క్యాష్‌విత్‌డ్రాయల్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎంచుకొని, యూపీఐ యాప్ ద్వారా ఏటీఎం స్క్రీన్ పైన కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. 
 
ఏదైనా యూపీఐ యాప్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. కోడ్ స్కాన్ చేసి, అమౌంట్ ఎంటర్ చేసి, పిన్ ఎంటర్ చేస్తే చాలు. అమౌంట్ డ్రా అవుతాయి.