శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జులై 2021 (15:26 IST)

యూపీఐ ట్రాన్సాక్షన్లకు పరిమితి.. రోజుకు రూ.లక్షే

కరోనా వైరస్ నేపథ్యంలో యూపీఐ చెల్లింపుల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి పలు రకాల యాప్స్ ద్వారా చెల్లింపులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కస్టమర్లు ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు డబ్బులు వెంటనే పంపించుకోవచ్చు. అయితే యూపీఐ ట్రాన్సాక్షన్లకు పరిమితి ఉంటుంది. 
 
మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ల ద్వారా ఒక రోజులో రూ.లక్ష వరకు మాత్రమే పంపొచ్చు. అలాగే రోజుకు 10 వరకు లావాదేవీలను మాత్రమే నిర్వహించడానికి వీలుంటుంది. రెండింటిలో ఏ లిమిట్ దాటినా డబ్బులు పంపడానికి వీలుండదు. తర్వాత రోజు వరకు ఆగాల్సిందే. 
 
గూగుల్ పే కూడా యూపీఐ ఆధారంగానే పనిచేస్తుంది. అందువల్ల యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్స్ గూగుల్‌ పేకు కూడా వర్తిస్తాయి. అంతేకాకుండా బ్యాంక్ ప్రాతిపదికన ఒకేసారి యూపీఐ ద్వారా ఎంత డబ్బులు పంపొచ్చనే అంశం మారుతుంది. ఫోన్‌పేకు కూడా ఇదే రూల్స్ వర్తిస్తాయని చెప్పుకోవచ్చు.