జియోకు షాక్.. రూ.99కే వోడాఫోన్ న్యూ ప్లాన్

రిలయన్స్ జియోకు షాకిచ్చేలా వోడాఫోన్ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదీకూడా రూ.99కే ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్‌ జియో 98, ఎయిర్‌టెల్‌ 99రూపాయల రీచార్జ్‌ ప్లాన్ తరహాలో కొత్త ప్లాన్

vodafone logo
pnr| Last Updated: మంగళవారం, 14 ఆగస్టు 2018 (12:50 IST)
రిలయన్స్ జియోకు షాకిచ్చేలా వోడాఫోన్ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదీకూడా రూ.99కే ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్‌ జియో 98, ఎయిర్‌టెల్‌ 99రూపాయల రీచార్జ్‌ ప్లాన్ తరహాలో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.99కే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.
 
అయితే, మిగిలిన ప్రైవేట్ టెలికాం కంపెనీలై ఎయిర్‌టెల్‌, జియో తరహాలో ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం మాత్రం ఇవ్వడం లేదు. ఇక ఈ ప్లాన్ కాలపరిమితిని 28 రోజులుగా నిర్ణయించినప్పటికీ రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్ మాత్రమే చేసుకునేలా నిబంధన విధించింది. వొడాఫోన్ వెబ్‌సైట్‌, యాప్‌లో ఈ ప్లాన్‌ను రీ ఛార్జి చేసుకునే ఆఫర్‌ కల్పించింది.
 
మరోవైపు 99 రూపాయలకు ఎయిర్‌టెల్‌ 1 జీబీ డేటా, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ప్లాన్‌ వాలిడిటీ 10 రోజులు మాత్రమే. ఇక జియో రూ.98 ప్లాన్‌లో 1 జీబీ డేటా, రోజుకు 300ఎస్‌ఎంఎస్‌లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీనిపై మరింత చదవండి :