మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 జులై 2019 (18:39 IST)

దుస్తులను మడతబెట్టే రోబోట్ వచ్చేసింది.. మీకు తెలుసా?

మహిళలు బట్టలు ఉతకటం.. వాటిని ఎండబెట్టి.. మడత బెట్టడానికి శ్రమపడుతుంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ఎండబెట్టిన దుస్తులను నీట్‌గా మడత పెట్టేందుకు ఓ రోబో వచ్చేసింది. అవును.. 12 సంవత్సరాల బాలిక ఈ "క్లోథ్స్ ఫోల్డింగ్ రోబోట్‌"ను కనుగొంది. దాని వివరాల్లోకి వెళితే.. 12 ఏళ్ల ఫాతియా అబ్ధుల్లా అనే నైజీరియా బాలిక.. దుస్తులను మడతబెట్టే రోబోను కనుగొంది. 
 
ఈ రోబోను కావాలనుకునేవారు దాన్ని తన నుంచి కొనుగోలు చేసుకోవచ్చునని కూడా చెప్పింది. లాండ్రీ-ఫోల్డింగ్ రోబోట్‌ను ఎలా తయారు చేయాలో 12 సంవత్సరాల ఫాతియా అబ్ధుల్లా నేర్చుకుంది. కోడ్ ఆధారంగా ఈ రోబోట్‌ను రూపొందింది.
 
ఇందుకోసం పిన్స్, బీమ్స్‌ను ఉపయోగించింది. ఈ రోబోట్ వారాంతాల్లో అధికంగా దుస్తులు ఉతికి.. వాటిని ఆరబెట్టి.. మడతబెట్టే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని మూడంటే మూడే సెకన్లలో టీషర్టులను ఈ రోబోట్ మడత బెట్టేస్తుందని ఫాతియా అబ్ధుల్లా తెలిపింది. ప్రస్తుతం ఫాతిమా కనిపెట్టిన రోబోట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.