బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (15:46 IST)

వాట్సాప్‌లో మెసేజ్ రీకాల్ ఫీచర్....

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌లో మెసేజ్ రీకాల్ యాప్‌ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఈ ఫీచర్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. అపుడు ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు చేశారు. కానీ, ఇపుడు వాట్సాప్

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌లో మెసేజ్ రీకాల్ యాప్‌ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఈ ఫీచర్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. అపుడు ప్రయోగాత్మకంగా మాత్రమే అమలు చేశారు. కానీ, ఇపుడు వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చారు. 
 
ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, వాట్సాప్ వెబ్ ప్లాట్‌ఫాంలపై యూజర్లు వాడుకోవచ్చు. ఈ ఫీచర్ వల్ల యూజర్లు తాము వాట్సాప్‌లో సెండ్ చేసిన మెసేజ్‌లను డిలీట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 
 
అందుకు 7 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఆ టైం లిమిట్ దాటితే మెసేజ్‌లను డిలీట్ చేయడం కుదరదు. ఇక డిలీట్ అయిన మెసేజ్ స్థానంలో 'దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్' అనే వాక్యం కనిపిస్తుంది.