మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (17:33 IST)

వాట్సాప్‌లో కొత్త ఫీచర్: పొరపాటున పంపిన మెసేజ్‌లను తొలగించుకోవచ్చు...

సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను జోడించింది. సోషల్ మాధ్యమాలకు పెరుగుతున్న క్రేజ్ నేపథ్యంలో మొన్నటికి మొన్న ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ లైవ్‌ను ప్రవేశపెడితే.. తాజాగా వాట్సాప్ గ్రూప్‌లో పొరపాటు

సోషల్ మీడియాలో ఒకటైన వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను జోడించింది. సోషల్ మాధ్యమాలకు పెరుగుతున్న క్రేజ్ నేపథ్యంలో మొన్నటికి మొన్న ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ లైవ్‌ను ప్రవేశపెడితే.. తాజాగా వాట్సాప్ గ్రూప్‌లో పొరపాటున పెట్టిన సందేశాలను కూడా తొలగించే సదుపాయాన్ని కల్పించింది. 
 
రోజుకో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న వాట్సప్.. ''మెస్సేజ్ రీకాల్" పేరుతో వ్య‌క్తిగతంగా గానీ, గ్రూప్‌లో గానీ పొర‌పాటున పంపిన మెసేజ్‌ల‌ను తొల‌గించే అవ‌కాశాన్ని ఈ ఫీచ‌ర్ ద్వారా అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. కేవ‌లం టెక్ట్స్‌ సందేశాలు మాత్ర‌మే కాకుండా ఫొటోలు, జిఫ్‌ ఫైల్స్‌, వీడియోలు, కాంటాక్ట్‌లను కూడా ఈ ఫీచర్‌ ద్వారా రీకాల్‌ చేసుకోవచ్చు. 
 
కానీ ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా కొంతమంది యూజర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వారి ఫీడ్‌బ్యాడ్ ఆధారంగా ద‌శ‌ల వారీగా ఈ ఫీచర్‌ను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే గ్రూప్‌లో మెసేజ్‌ల‌ను మాత్రం ఎవ‌రూ చ‌ద‌వ‌క‌ముందే రీకాల్ చేసుకోవాలి. ఒక్క‌రు చ‌దివినా ఆ సందేశాన్ని రీకాల్ చేసుకోలేరని వాట్సాప్ వెల్లడించింది.