గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (13:31 IST)

‌AI వాయిస్‌తో వాట్సాప్ కొత్త ఫీచర్.. ముందు ఏ భాషతో మొదలవుతుందంటే?

whatsapp
ఓపెన్ఏఐ చాట్ జీపీటీ తరహాలోనే Meta AI వాయిస్‌లను ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ కోసం పరిచయం చేయనుంది. ఈ ఫీచర్ పబ్లిక్ ఫిగర్‌లచే స్ఫూర్తి పొందిన వాయిస్‌లతో సహా పలు రకాల వాయిస్‌లను అందిస్తుంది. 
 
ఇప్పటికే మెటా AIని దాని చాట్ ఇంటర్‌ఫేస్‌లో ప్రవేశపెట్టింది. వినియోగదారులు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, చిత్రాలను రూపొందించడానికి లేదా సాధారణ టెక్స్ట్ ప్రాంప్ట్‌తో కొత్త వంటకాలను కనుగొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. 
 
ఈ ఫీచర్ AI ఇంటిగ్రేషన్ యూజర్ ఫ్రెండ్లీగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వాట్సాప్ మెటా ఏఐ వాయిస్ మోడ్‌ను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోంది. వినియోగదారులు వారి ప్రాధాన్యతలకు సరిపోయే వాయిస్‌లలో ఏఐతో కమ్యూనికేట్ చేయడానికి అనుమతిస్తుంది.
 
అయితే మెటా ఏఐ వాయిస్ ఫీచర్ ఇంగ్లీష్ మించిన భాషలకు మద్దతు ఇస్తుందా? అనేది తెలియాల్సి వుంది. అయితే ప్రస్తుతానికి, మొదటి విడుదల ఆంగ్లంపై మాత్రమే దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. 
 
అయినప్పటికీ, ఫీచర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, హిందీ వంటి ఇతర భాషలను చేర్చడానికి వాట్సాప్ విస్తరించే అవకాశం ఉంది. ఆపై ఇతర ప్రాంతీయ భాషలకు ఇది వ్యాప్తి చెందే ఆస్కారం వుంది.