శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (14:12 IST)

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదట...!! (video)

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వాట్సాప్ ఒకటి. ఒక సమాచారాన్ని క్షణాల్లో ఇతరులకు చేరవేయాలన్నా? లేక ఒకేసారి పది మందికి పంపించాలన్నా ఏకైక మార్గం వాట్సాప్. అలాంటి వాట్సాప్ ఇకపై కొన్ని రకాల ఫోన్లలో 2021 నుంచి పనిచేయదు. ఔట్‌ డేటెడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌పై ఇకపై వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ఐఓఎస్ 9, ఆండ్రాయిడ్ 4.0.3 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల‌ను కూడా వాట్సాప్ ఈ లిస్ట్‌లో చేర్చింది. 
 
ఈ వెర్ష‌న్ల కంటే కొత్త వాటిలోనే త‌మ మెసేజింగ్ యాప్ అన్ని ఫీచ‌ర్ల‌తో కొన‌సాగుతుంద‌ని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింది. ఆ లెక్క‌న ఐఫోన్ 4 వాడుతున్న యూజ‌ర్లు ఇక మీద‌ట వాట్సాప్ సేవ‌ల‌ను పొంద‌లేరు. ఇక ఐఫోన్ 4ఎస్‌, 5, 5ఎస్‌, 6, 6ఎస్ ఫోన్ వాడుతున్న వాళ్లు త‌మ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఐఓఎస్ 9 నుంచి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఇక ఆండ్రాయిడ్ విష‌యానికి వ‌స్తే 4.0.3 వెర్ష‌న్ ఫోన్లు వాడుతున్న యూజ‌ర్లు ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు లేర‌నే చెప్పాలి. అయితే హెచ్‌టీసీ డిజైర్‌, ఎల్జీ ఆప్టిమ‌స్ బ్లాక్‌, మోటొరోలా డ్రాయిడ్ రేజ‌ర్‌, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌2 ఫోన్ల‌ను వాడుతున్న వాళ్లు వాట్సాప్ సేవ‌ల‌ను ఇక పొంద‌లేరు. వీళ్లు అప్‌డేటెడ్ వెర్ష‌న్‌తో ఉన్న‌ కొత్త స్మార్ట్‌ఫోన్ల‌ను కొనుగోలు చేయాల్సిందే. 
 
మీ ఫోన్ వెర్ష‌న్ తెలుసుకోవాల‌ని అనుకుంటే.. ఐఫోన్ యూజ‌ర్లు సెటింగ్స్‌లో జ‌న‌ర‌ల్‌లోకి వెళ్లి ఇన్ఫ‌ర్మేష‌న్‌లో చూసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌యితే సెటింగ్స్‌లో అబౌట్ ఫోన్‌లో తెలుసుకోవ‌చ్చు.