యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను 1000 నుంచి 500లకు తగ్గిందోచ్!
మీరు యూట్యూబ్‌లో ఎక్కువమంది సబ్‌స్క్రైబర్‌లను పొందేందుకు కష్టపడుతున్న కంటెంట్ సృష్టికర్తలైతే ఇది మీకు గుడ్ న్యూస్. గూగల్ యాజమాన్యంలోని వీడియో కంపెనీ కనీస సబ్‌స్క్రైబర్‌ల సంఖ్యను వెయ్యి నుంచి ఐదు వందలకు తగ్గించింది.
యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌లో చిన్న సృష్టికర్తలకు మరిన్ని అవకాశాలను అందించడానికి యూట్యూబ్ మానిటైజేషన్ విధానాలకు భారీ మార్పులు చేస్తోంది. యూట్యూబ్ భాగస్వామి ప్రోగ్రామ్‌కు అర్హత అవసరాలను తగ్గిస్తున్నట్లు, తక్కువ ఫాలోయింగ్ ఉన్న క్రియేటర్‌లకు అందుబాటులో ఉన్న మానిటైజేషన్ పద్ధతుల పరిధిని విస్తరింపజేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
కొత్త విధానం ప్రకారం, క్రియేటర్‌లు అర్హత పొందాలంటే 500 మంది సబ్‌స్క్రైబర్‌లను మాత్రమే కలిగి ఉండాలి. ఇది మునుపటి అవసరంలో సగం. దానితో పాటు వీక్షణ గంటల ప్రమాణాలు 4,000 నుండి 3,000కి తగ్గించబడ్డాయి. షార్ట్స్ వీక్షణల అవసరం 10 మిలియన్ నుండి 3 మిలియన్లకు తగ్గించబడింది.