ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (17:47 IST)

జూమ్ సంచలన నిర్ణయం.. ఏకంగా అధ్యక్షుడిపైనే వేటు

zoom app
ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆ కంపెనీ అధ్యక్షుడిపైనే వేటువేసింది. జూమ్ సంస్థ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన గ్రెగ్ టాంబ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
అయితే, గ్రెగ్ తొలగింపునకు కారణాలు వెల్లడించలేదు. దీనిపై పలువురు టెక్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జూమ్ అధ్యక్షుడుగా గ్రెగ్ గత యేడాది నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించి ఒక యేడాది కూడా కాకముందే ఆయనను బాధ్యతల నుంచి తొలగించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పైగా, కంపెనీ అధ్యక్ష బాధ్యతలను మరొకరికి అప్పగించే ఆలోచన ప్రస్తుతానికి ఏమీ లేదని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.