శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By మోహన్
Last Modified: గురువారం, 14 మే 2020 (18:38 IST)

ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతోందా? అయితే ఇలా చేయండి

కరోనాను ఎదుర్కొనేందుకు దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా లక్షలాది మంది ఐటి ఉద్యోగులు తమ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు(వర్క్ ఫ్రమ్ హోమ్). ఇంటి నుంచే పనిచేయడం కోసం వీరందరూ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌పై ఆధారపడ్డారు. వీరిలో ఎక్కువ శాతం మంది ల్యాప్‌టాప్‌లకు ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేసుకుని వాడుతున్నారు. 
 
ఎక్కువ సమయంపాటు ల్యాప్‌టాప్‌ను వాడటం వల్ల బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతుంది. అలా కాకుండా బ్యాటరీని ఆదా చేసుకోవాలనుకుంటే, క్రింద పేర్కొన్న సూచనలను పాటించడం ద్వారా ల్యాప్‌టాప్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడం ఎలాగో తెలుసుకుందాం.
 
* మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌లను ఎక్కువగా ఉపయోగించకుండా ఉంటే బ్యాటరీ అధిక భాగం ఆదా అవుతుంది.
 
* ల్యాప్‌టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచుకోవాలి.
 
* ల్యాప్‌టాప్ ఎక్కువ వేడి కాకుండా చూసుకోండి. వీలైతే కూలింగ్ ప్యాడ్‌లను ఉపయోగించండి.
 
* స్క్రీన్‌సేవర్‌లను పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఇది బ్యాటరీని అదనంగా ఉపయోగించుకుంటుంది.
 
* ల్యాప్‌టాప్ సాఫ్ట్‌వేర్ డ్రైవర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి.
 
* ల్యాప్‌టాప్‌పై చేయవలసిన పనులను వీలైనంత త్వరగా ముగించుకునేందుకు ప్రయత్నించండి. ఎక్కువసేవు ల్యాప్‌టాప్‌ను ఉపయోగించవద్దు.