శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 నవంబరు 2016 (13:33 IST)

జియో కంటే ఎయిర్ టెల్ బెటర్.. కాల్ డ్రాప్, నెట్ స్లోనే కొంపముంచుతాయా? జియో క్రేజ్ గోవిందా?

జియో దెబ్బకు టెలికామ్ రంగ సంస్థలకు దిమ్మ తిరిగింది. ఉచిత సిమ్, ఉచిత ఇంటర్నెట్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు తీపి కబురిచ్చిన రిలయన్స్ జియోకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే జియ

జియో దెబ్బకు టెలికామ్ రంగ సంస్థలకు దిమ్మ తిరిగింది. ఉచిత సిమ్, ఉచిత ఇంటర్నెట్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారులకు తీపి కబురిచ్చిన రిలయన్స్ జియోకు నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే జియో ఆఫర్లతో తమ కంపెనీకి దెబ్బేనని ఉడికిపోతున్న ఎయిర్ టెల్.. జియో ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా జియోతో వార్‌కు సై అంటోంది. 
 
ఉచితం అనే పేరుతో జియో ఆఫర్ చేస్తున్న ఉచిత వెల్‌కమ్ ఆఫర్‌కు దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. డిసెంబర్ 31 2016తో ఈ ఆఫర్ ముగియనుంది. మార్కెట్లో లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే రూ.3 కోట్ల పై చిలుకు యూజర్లను సంపాదించుకున్న జియో దేశ వ్యాప్తంగా బలమైన డిజిటల్ ఇకో సిస్టమ్‌ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.  
 
అయితే జియోకు ధీటుగా రాణించాలని ఎయిర్‌టెల్ సన్నద్ధమవుతోంది. ఆధునిక కమ్యూనికేషన్ అస్త్రాలను మార్కెట్లో సంధించినప్పటికి ఎయిర్‌టెల్‌తో పోలిస్తే జియో వెనుకబడి ఉన్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయాన్ని బలంగా చేసుకున్న ఎయిర్ టెల్.. జియోతో పోటీకి రెడీ అంటోంది. జియో ఆఫర్ చేసే ఎల్టీఈ నెట్ వర్కుతో పోల్చుకుంటే ఎయిర్ టెల్ నెట్ వర్క్ మెరుగ్గా ఉంది. 
 
ఎలాగంటే..? 
జియో యూజర్లను కాల్ డ్రాప్స్ సమస్య తప్పట్లేదు. జియో యూజర్లు ఇతర నెట్‌వర్కులకు కాల్ చేస్తున్న సమయంలో 90శాతం వరకు కాల్ డ్రాప్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు చెప్తున్నాయి. ఇతర టెల్కోలు ఇంటర్‌కనెక్షన్ పాయింట్‌లను ఇవ్వకపోవటం కారణంగానే ఇలా జరుగుతోందని జియో ఆరోపిస్తోంది. మరోవైపు ఎయిర్‌టెల్ తన రెండు దశాబ్ధాల సుధీర్ఘమైన అనుభవంతో మార్కెట్లో దూసుకుపోతోంది. 
 
జియో ఆఫర్ చేసే సర్వీసులు 4జీ మాత్రమే పరిమితం అయితే, ఎయిర్ టెల్ సేవలు 2జీ, 3జీ, 4జీ ఫోన్లలోనూ వాడుకునే ఛాన్సుంది. అలాగే జియో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయింది. కొన్ని ప్రాంతాల్లో జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ వేగవంతమైన డేటా స్పీడ్లను నమోదు చేయటం విశేషం. జియో కస్టమర్ కేర్ సేవలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అదే ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ సేవలు మెరుగ్గా ఉన్నాయి.