ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జులై 2023 (10:30 IST)

వర్షాకాలంలో పిల్లలకు న్యుమోనియా.. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే..?

kids
వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా న్యుమోనియా బారిన పడతారు కాబట్టి ఈ జ్వరం నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
 
5 సంవత్సరాలలోపు తల్లిపాలు తాగే పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు తల్లిపాలు పట్టించాలని వైద్యులు కూడా చెప్పారు. ఇంట్లో కట్టెల పొయ్యి ఉంటే ఆ పొగను పిల్లలు పీల్చినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోయి న్యుమోనియా వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
 
పిల్లలకు జ్వరం, దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోకుంటే క్రిములు ప్రవేశించి ప్రమాదకరంగా మారతాయని వైద్యులు కూడా చెప్తున్నారు. అందువల్ల వైద్యుల సలహా మేరకు న్యుమోనియా ఫీవర్ నుండి పిల్లలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు