నాక్కాదు.. మా చెల్లికి రావుగా..!!
"చింటూ.. నీకు మీ మమ్మీ పది రూపాయలు ఇచ్చి అందులో సగం చెల్లికి ఇవ్వమంటే ఎంత ఇస్తావురా..?" అడిగింది టీచర్
"రెండు రూపాయలు ఇస్తాను టీచర్..!!" చెప్పాడు చింటూ
"అదెలారా... నీకు లెక్కలు రావా ఏంటీ..?"
"నాకు కాదు టీచర్.. మా చెల్లికి రావుగా...!!"