గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కవితలు
Written By ivr
Last Modified: గురువారం, 17 సెప్టెంబరు 2015 (17:14 IST)

ఆయుర్దాయం ఉన్నంతవరకూ జనులు...

ఆశ చేత మనుజు లాయువు గలనాళ్లు
తిరుగుచుందురు భ్రమ ద్రిప్పలేక
మురికి భాండమందు ముసురు నీగల భంగి
విశ్వదాభిరామ వినురవేమ
 
తాత్పర్యము... జనులు ఆశచేత ఆయుర్దాయము ఉన్నంత వరకూ కోరికలను విడువలేక తిరుగుచుందురు. ఎట్లనగా దుర్వాసన గల కుండయందు ముసురు ఈగల వలె తిరుగుచుందురు వేమా.