గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By JSK
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2016 (20:24 IST)

కృష్ణా పుష్కారాల పార్కింగ్ ప్లేస్‌లివే

అర్బన్‌లో పార్కింగ్‌ ప్లేస్‌లు ఖరారు చేసిన జిల్లా యంత్రాంగం. 12 రూట్లలో పార్కింగ్‌ ఏరియాలు, 24 ప్రాంతాలలో పార్కింగ్‌ ప్లేస్‌లు, ద్విచక్రవాహనాల కెపాసిటీ - 62,750, కార్ల కెపాసిటీ - 6270. కృష్ణా పుష్కారా

అర్బన్‌లో పార్కింగ్‌ ప్లేస్‌లు ఖరారు చేసిన జిల్లా యంత్రాంగం. 12 రూట్లలో పార్కింగ్‌ ఏరియాలు, 24 ప్రాంతాలలో పార్కింగ్‌ ప్లేస్‌లు, ద్విచక్రవాహనాల కెపాసిటీ - 62,750, కార్ల కెపాసిటీ - 6270. కృష్ణా పుష్కారాల తాకిడి అంతా బెజవాడలోనే ఉంటుంది. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే యాత్రీకులు సింహభాగం బెజవాడకే వస్తారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణా జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు, రైళ్ళలో వచ్చే యాత్రికులను ఎక్కడికక్కడ శాటిలైట్‌ రైల్వేస్టేషన్స్‌, శాటిలైట్‌ తాత్కాలిక బస్‌స్టేషన్స్‌ ద్వారా పుష్కరనగర్‌లకు సిటీ బస్సుల్లో తరలించటానికి ఆర్టీసీ, రైల్వేశాఖల సౌజన్యంతో కృష్ణా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ అర్బన్‌, రూరల్‌ పరిధిలో వేర్వేరుగా పార్కింగ్‌ ఏరియాలను గుర్తించి ప్రకటించారు.
 
విజయవాడ అర్బన్‌ ఏరియాలో మొత్తం 12 రూట్లలో 24 ప్రాంతాలలో పార్కింగ్‌ ప్లేస్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. పార్కింగ్‌ ప్లేస్‌లు ఏర్పాటు చేయటానికి ఈ 24 ప్రాంతాలలో మొత్తం 2,97,700 చదరపు గజాల స్థలాన్ని గుర్తించారు. నగరం నలువైపులా ప్రైవేటు వాహనాల కోసం పార్కింగ్‌ ప్లేస్‌లను గుర్తించారు. మూడు నియోజకవర్గాల పరిధిలో ప్రధాన రోడ్లకు సమీపంలో పార్కింగ్‌ ప్లేస్‌లను యంత్రాంగం గుర్తించింది. 
 
ఎక్కడా ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా నేరుగా ప్రధాన రోడ్ల మీదకు చేరుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయే అవకాశాన్ని కల్పించారు. నగర వ్యాప్తంగా గుర్తించిన పార్కింగ్‌ ప్లేస్‌లలో మొత్తం 62,750 ద్విచక్రవాహనాలు, 6270 కార్లను పార్కింగ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. పుష్కర స్నానం ముగించుకుని, ఇతర కార్యక్రమాలను చక్క బెట్టుకోవటానికి ఎంత లేదన్నా ఐదు గంటల సమయం పడుతుంది. ఈ లెక్కన రోజుకు లక్షన్నర వరకు ద్విచక్ర వాహనాలు, 20 వేల వరకు కార్లను పార్కింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.
 
వారధి ఏరియా (ఏలూరు సైడ్‌ - గుంటూరు సైడ్‌) 
1. దూరదూర్శన్‌ ఓపెన్‌ సైట్‌, ఫీడర్‌ రోడ్డు, 
కృష్ణ్ణలంక, స్థలం : 19,200 గజాలు 
కెపాసిటీ : ద్విచక్ర వాహనాలు - 2000, 
కార్లు - 400 
2. పొట్టి శ్రీరాములు స్కూల్‌, క్రష్ణ్ణలంక 
స్థలం : 14,400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్ర వాహనాలు - 150, కార్లు - 300
 
ఇబ్రహీంపట్నం - గొల్లపూడి వై జంక్షన్‌ 
1. సొసైటీ ప్రైవేటు స్థలం తుమ్మలపాలెం గ్రామం 
స్థలం : 24000 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1000, కార్లు - 500
 
గొల్లపూడి వై జంక్షన్‌ - స్వాతి సెంటర్‌, 
గొల్లపూడి వై జంక్షన్‌ - కుమ్మరిపాలెం : 
1. మార్బుల్‌ యార్డ్‌ , గొల్లపూడి 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు -100 
కార్లు - 100 
2. షాదీఖానా, కుమ్మరిపాలెం 
(గుప్తా సెంటర్‌) 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు : 200 
కార్లు - 100
 
కాళేశ్వరరావు మార్కెట్‌ ఏరియా 
1. కేఆర్‌ మార్కెట్‌ సెల్లార్‌ 
స్థలం : 2400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 100 
కార్లు - 50 
2. వక్డ్‌బోర్డు ఖాళీ స్థలం, ఇందాద్‌ 
ఘర్‌ (కేఆర్‌ మార్కెట్‌ ఎదురుగా) 
స్థలం : 2400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 100 
కార్లు - 50 
3. వన్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఎదురుగా : 
స్థలం : 2400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 100 
కార్లు - 50
 
తారాపేట - వెస్ట్‌ బుకింగ్‌ ఏరియా 
1. కృష్ణ్ణవేణి క్లాత్‌ మార్కెట్‌ సెల్లార్‌ 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 500 
కార్లు - 100
 
కాల్టెక్స్‌ రోడ్డు, మెయిన్‌ రైల్వే స్టేషన్‌ 
1. పాత ప్రభుత్వ హాస్పిటల్‌ 
దగ్గర ఖాళీ స్థలం 
స్థలం : 2400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 500 
కార్లు - 100 
2. ఆంధ్రపత్రిక ఓపెన్‌ సైట్‌ 
స్థలం : 2500 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 600 
కార్లు - 70 
3. జింఖానా గ్రౌండ్స్‌, గాంధీనగర్‌ 
స్థలం : 2400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 400 
కార్లు - 50 
4. సత్యనారాయణపురం రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1000 
కార్లు - 200 
5. సత్యనారాయణపురం రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1000 
కార్లు - 200 
6. మధురానగర్‌ రైల్వేస్టేషన్‌ ఎదురు (కేంద్రీయ విద్యాలయం) 
స్థలం : 14000 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 3000 
కార్లు - 300
 
ఎంజీ రోడ్‌ 
1. సిద్దార్థ మహిళా కాలేజీ 
స్థలం : 19,200 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 2000 
కార్లు - 400
 
ఐదవ నెంబర్‌ రూట్‌ 
1. బిషప్‌ అజరయ్య స్కూల్‌, రెడ్‌ సర్కిల్‌ 
స్థలం : 14,400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1500 
కార్లు - 300 
2. సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ , పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డు 
స్థలం : 28,800 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 2500 , కార్లు - 500
 
చుట్టుగుంట - సీతారామపురం 
1. శాతవాహన కాలేజి 
స్థలం : 14,400 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1500 , కార్లు - 300
 
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు - రామవరప్పాడు జంక్షన్‌, గొల్లపూడి వై జంక్షన్‌ - నున్న బైపాస్‌, మ్యాంగో మార్కెట్‌ 
1. మాకినేని బసవపున్నయ్య స్టేడియం , అజిత్‌సింగ్‌ నగర్‌ 
స్థలం : 19000 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 2000 
కార్లు - 500 
2. రోహిత్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ , పైపుల రోడ్డు 
స్థలం : 10000 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1000 
కార్లు - 100 
3. గుణదల రైల్వేస్టేషన్‌ గ్రౌండ్‌ ఎదురుగా : 
స్థలం : 5000 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 1000 
కార్లు - 100
 
వైవీ రావు ఎస్టేటు ఓపెన్‌ సైట్‌ 
1. వైవీ రావు ఎస్టేటు స్థలం (ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు) 
స్థలం : 4800 గజాలు 
కెపాసిటీ : ద్విచక్రవాహనాలు - 500 
 
కార్లు - రమేష్‌ హాస్పిటల్‌ ఏరియా
1. ఆంధ్రా లయోల కాలేజీ గ్రౌండ్స్‌, స్థలం : 72000 గజాలు.