కృష్ణానదిగా మారిన విష్ణుమూర్తి... కారణం ఏమిటి...? కృష్ణా పుష్కరాలు
దేవగురువైన బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినపుడు మనకు ఈ కృష్ణానదీ పుష్కరాలు వస్తాయి. శ్రీ దుర్మిఖి నామ సంవత్సరం దక్షిణాయణం, వర్ష రుతువు, శ్రావణ మాస, శుక్ల అష్టమి, తత్కాల నవమి, గురువారం, అనురాధ నక్షత్రం, బ్రహ్మయోగ సమయం అనగా రాత్రి 9.28 నిమిషాలకు ప్రారం
శ్లో|| కన్యారాశిగతే దీవే కృష్ణవేణి నదీ తటే,
స్నానం దానం తథా క్షౌరం త్రికోటికుల ముద్ధరేత్
దేవగురువైన బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినపుడు మనకు ఈ కృష్ణానదీ పుష్కరాలు వస్తాయి. శ్రీ దుర్మిఖి నామ సంవత్సరం దక్షిణాయణం, వర్ష రుతువు, శ్రావణ మాస, శుక్ల అష్టమి, తత్కాల నవమి, గురువారం, అనురాధ నక్షత్రం, బ్రహ్మయోగ సమయం అనగా రాత్రి 9.28 నిమిషాలకు ప్రారంభమైనది కనుక 12-08-2016 నుంచి 12 దినములు అనగా 23-08-2016 వరకూ త్రికోటి సహిత కృష్ణవేణి పుష్కరాలు జరుగును.
ఈ పుష్కర కాలంలో ఎవరైతే స్నానం చేసి, పితృదేవతలకు, పిండప్రదానం, క్షురకర్మలు ఆచరిస్తారో వారు త్రికోటి కులాలను ఉద్ధరించిన వారవుతారని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. కలియుగంలో పాపభూయిష్టులై ఉండే జీవులకు తరుణోపాయం ప్రసాదించమని బ్రహ్మ విష్ణువుని ప్రార్థించసాగాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు తన అంశతో కృష్ణానదిని ఉద్భవింపచేసి, ఈ నీటిలో స్నానం చేసిన ప్రాణకోటికి పాపనివృత్తి కలుగుతుందని అనుగ్రహించాడు. మహావిష్ణువు అంశంతో ఉద్భవించిన ఈ కృష్ణానదిలో తాను లింగరూపుడై ఉంటాననీ, ఈ పవిత్ర జలాలతో ఎవరైతే అభిషేకిస్తారో వారికి సాయుజ్యమిస్తానని పరమశివుడు వరం ఇచ్చాడు.
ఈ కృష్ణానది మహాబలేశ్వరపు కొండలలో పుట్టి కృష్ణాజిల్లాలోని హంసలదీవి వద్ద సాగరంలో కలుస్తుంది. లోకాలను తరింపజేయడానికి కృష్ణపరమాత్మ సహ్యాద్రి పైన అశ్వత్థ వృక్షంలో నిలిచాడనీ, ఆ చెట్లు వేళ్ల కిందనుండి కృష్ణానది ఉద్భవించిందని పురాణగాధ. ఈ పురాణగాధతో పాటు ఒక ఆసక్తికరమైన కథ కూడా దీని వెనుక ఉంది.
పూర్వం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పశ్చిమకనుమల్లో సహ్యాద్రిపైన ఒక యజ్ఞం చేయతలపెట్టాడు. ఆయన మొదటిభార్య అయిన సరస్వతి అక్కడకు చేరడానికి సమయం మించడంతో, విష్ణువు, పరమశివుని సలహాపై ఆయన రెండో భార్య అయిన గాయత్రిని ప్రక్కన కూర్చోబెట్టుకుని క్రతువు ఆరంభించారట. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న సరస్వతిదేవి ఆగ్రహం చెంది అక్కడున్న త్రిమూర్తులతో సహా అక్కడున్న వారందరినీ నదులుగా మార్చివేసింది. అప్పుడు విష్ణువు కృష్ణానదిగాను, శివుడు వేణీ నదిగానూ, బ్రహ్మ కాకుద్మతీ నదిగాను మారి ఈ త్రిమూర్తులు కలిసి పశ్చిమ కనుమల్లో ప్రవహించారు.
మిగిలిన దేవతలు, ఋషులు నదులుగా మారి కృష్ణలో కలిశారు. నాకంటే చిన్నదైన గాయత్రీ బ్రహ్మదేవునికి దక్షిణభాగంలో నా స్థానంలో నాకంటే చిన్నదైన గాయత్రీ బ్రహ్మదేవునికి దక్షిణభాగంలో నా స్థానంలో దీక్షాపరురాలై కూర్చింది కనుక ఈమె ఎప్పుడూ లోకంలో జనులకు కనబడని శరీరంతో నదీ రూపాన్ని పొందుగాక అని సరస్వతీ దేవి శపించింది. నన్ను వృధాగా శపించావు కనుక నీవు కూడా నదీ రూపాన్ని పొందుతావని సరస్వతిని శపించింది గాయత్రీదేవి.
ఈ గాయత్రీ, సరస్వతీ రెండు నదులు పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తూ సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమించి సావిత్రి నది అని పేరు పొందాయి. సహ్యాద్రిపై బ్రహ్మ తపస్సు చేసిన చోట బ్రహ్మగిరి. వేదాలు మూర్తి రూపం పొంది శివుని స్తుతించిన స్థలంలో వేదగిరి ఆ వేదగిరి దగ్గర కృష్ణపరమాత్మ అశ్వత్థరూపం దాల్చాడని చెబుతారు. అలాగే మహర్షులు పరమశివుణ్ణి స్తుతించగా ఆయన లింగాకారంలో అక్కడ వెలిశాడని అక్కడ గల ఉసిరిక వృక్షం నుండి వేణీ నది అవతరించి కృష్ణానదిలో కలిసి కృష్ణవేణిగా ఏర్పడిందని పురాణాలు చెపుతున్నాయి.