సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : సోమవారం, 6 మే 2019 (12:46 IST)

నేను ఎవరి భార్యనంటూ ప్రశ్నిస్తున్న బాలీవుడ్ నటి?

బాలీవుడ్ సీనియర్ నటి పూనం సిన్హా. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లోక్నో స్థానంలో ఎస్పీ - బీఎస్పీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆచార్య ప్రమోద్ పోటీ చేస్తున్నారు. 
 
అయితే, ఈ స్థానంలో హెమాహేమీలు బరిలో ఉన్నప్పటికీ గెలుపు మాత్రం తనదేనని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2014కు, ఇప్పటి ఎన్నికలకు చాలా తేడా ఉందన్నారు. తాను ప్రచారం నిర్వహించిన అన్ని ప్రాంతాల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయం అర్థమయిందన్నారు. 
 
నిజానికి పూనమ్ సిన్హా భర్త శుత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నప్పటికీ తన భార్య కోసం ఆమె ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఒత్తిడికి లోనవుతున్నారా అని ప్రశ్నించగా, ఆమె ధీటుగా సమాధానమిచ్చారు. 'నేను ఎవరి భార్యను? ఆత్మవిశ్వాసానికి మరో పేరైన శత్రుఘ్నసిన్హా భార్యను. ఆయన ఆత్మవిశ్వాసంలో కొంత భాగం నాలో కూడా ఉంది. నేను పెద్ద యుద్ధంలో ఉన్నా. విజేతగా నిలుస్తా' అంటూ ధీమా వ్యక్తం చేశారు.