శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (15:34 IST)

భాగస్వాముల మధ్య ప్రేమ చిగురించే ఆహారాలేంటో తెలుసా?

భాగస్వాముల మధ్య ప్రేమ భావాలను పెంపొందించే ఆహారం గురించి మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. ఉరుకు పరుగుల జీవితం.. భాగస్వాముల మధ్య మాటలే కరువైనాయి. స్మార్ట్ ఫోన్లే అందరితోనూ మాట్లాడుతున్న నేటి కాలంలో భ

భాగస్వాముల మధ్య ప్రేమ భావాలను పెంపొందించే ఆహారం గురించి మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. ఉరుకు పరుగుల జీవితం.. భాగస్వాముల మధ్య మాటలే కరువైనాయి. స్మార్ట్ ఫోన్లే అందరితోనూ మాట్లాడుతున్న నేటి కాలంలో భాగస్వాముల మధ్య ప్రేమ చిగురించాలంటే.. ఇలాంటి ఆహారం తీసుకోవాలని న్యూట్రీషియన్లు సలహా ఇస్తున్నారు. 
 
శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా గల ఆహారాన్ని తీసుకోకుండా.. దోసకాయలు, కీరదోస ముక్కలు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించాలి. ఎంత ఒత్తిడితో కూడిన పనైనా ప్రశాంతంగా నిర్వహించడానికి అలవాటు పడాలి. మధ్య మధ్య పది నిమిషాలు విశ్రాంతి తీసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. చక్కగా స్నానం చేసి నిద్రకు ఉపక్రమించాలి. 
 
రోజుకు అరగంట ఏరోబిక్స్ చేస్తే మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయని వైద్యులు చెప్తున్నారు. ఇంకా డార్క్ చాక్లెట్‌ తప్పక తీసుకోవాలి. ఇందులో ఫినైల్ ఎమైన్ అనే పదార్థం..  భాగస్వాముల మధ్య ప్రేమను పెంపొందించే రసాయనాలను విడుదల చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.