గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By TJ
Last Modified: మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (18:00 IST)

ఒకవైపు శివనామ స్మరణలు - మరోవైపు గోవింద నామస్మరణలు..(Video)

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో కపిలేశ్వరస్వామి, శ్రీనివాసమంగాపురం కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను టిటిడి ప్రారంభించింది. టిటిడికి చెందిన అనుబంధ ఆలయాల్లో ప్రతియేటా బ్రహ్మోత్సవాలను నిర్వహిస

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో కపిలేశ్వరస్వామి, శ్రీనివాసమంగాపురం కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను టిటిడి ప్రారంభించింది. టిటిడికి చెందిన అనుబంధ ఆలయాల్లో ప్రతియేటా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. ఫిబ్రవరి నెలలోనే అధికంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 
 
కపిలేశ్వర స్వామి వీడియో చూడండి.
 
కపిలేశ్వరస్వామి, శ్రీనివాసమంగాపురంలలో బ్రహ్మోత్సవాలు తొమ్మిదిరోజుల పాటు వైభవోపేతంగా కొనసాగనున్నాయి. ప్రతిరోజు స్వామి వారు ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల సమయంలో ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాహన సేవలను భక్తులందరూ తిలకించే భాగ్యాన్ని కల్పిస్తోంది టిటిడి. ఒకవైపు శివనామస్మరణలు, మరోవైపు గోవింద నామస్మరణలతో తిరుపతి నగరం మారుమ్రోగుతోంది. చూడండి వీడియో...