గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (12:25 IST)

60వేల మందికి చుక్కలు చూపించిన పిల్లి.. రూ.100 కోట్లు నష్టం

పిల్లి ఏకంగా 60వేల మందికి చుక్కలు చూపించింది. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది నిజం. ఓ పిల్లి  ఏకంగా రూ.100 కోట్ల నష్టం జరగటానికి కారణమైంది.  60వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోవటానికి కారణమైంది. 
 
అంతేకాదు ఏడు వేలమంది వ్యాపారులు చీకట్లో ఏం చేయాలో తెలియక నానా తంటాలు పడ్డారు. పిల్లి చేసిన ఘనకార్యానికి ఒకటి రెండు కాదు ఏకంగా రూ.100 కోట్లు నష్టం వాటిల్లింది. 
 
ఓ పిల్లి మహా ట్రాన్స్‌మిషన్‌ సబ్‌స్టేషనులోని ట్రాన్స్‌ఫార్మరు మీదికి ఎక్కింది. మహారాష్ట్రలోని పుణె పట్టణ శివారున పింప్రీ-చించ్వడ్‌ ప్రాంతంలో ఏకంగా 60 వేల విద్యుత్తు కనెక్షన్లు తెగిపోయాయి. 
 
ఇంకా విద్యుత్ అంతరాయంతో వ్యాపారులకు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 12 లక్షల మీటర్ల వైర్లు నాశనమైనాయి.