సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (18:00 IST)

మైనర్ బాలికపై అత్యాచారం... 13 మంది 20 యేళ్ల జైలు

రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన కేసులో ముద్దాయిలుగా తేలిన 13 మందికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరో ఇద్దరికి నాలుగేళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తూ ఫోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. 
 
గత మార్చి 6వ తేదీన కోటా జిల్లాలోని సుకేత్ పోలీస్ స్టేషన్‌లో 15 యేళ్ల బాలిక అత్యాచారం కేసు నమోదైంది. పూజా జైన్ అనే మహిళ ఆ బాలికను ఇంటి నుంచి అపహరించి ఫిబ్రవరి 25న ఝలావర్‌లో విక్రయించింది. 
 
అనంతరం ఆ బాలికను యువకులు కొనుగోలు చేశారు. ఝులావర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆమెపై తొమ్మిది రోజుల పాటు వారు అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. 
 
ఈ కేసులో మొత్తం 16 మంది దోషులుగా తేల్చిన ఫోక్సో కోర్టు 20 యేళ్ళ పాటు జైలుశిక్ష విధించగా, మరో ఇద్దరు నాలుగేళ్ళ చొప్పున శిక్ష విధించింది. ఇదే కేసులో 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.