గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (10:45 IST)

హిమాచల్ ప్రదేశ్ కులులో రోడ్డు ప్రమాదం

school bus accident
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 35 నుంచి 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.