సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 జులై 2020 (13:12 IST)

డ్రాగన్ కంట్రీకి మరో షాక్.. చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్ చేస్తుందా?

డ్రాగన్ కంట్రీపై కేంద్రం కన్నెర్ర చేస్తోంది. సరిహద్దు వద్ద డ్రాగన్ కంట్రీ ఓవరాక్షన్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం చైనాకు సరిగ్గా బుద్ధి చెప్తోంది. ఇప్పటికే టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలోనే చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్ చేసేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
 
వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి, గోప్యతకు భంగం కలుగుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి భారత్‌లో 59 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఇందులో టిక్‌టాక్‌, హలో, షేర్‌ఇట్ వంటి యాప్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు చైనా దుందుడుకుతనానికి పూర్తిగా కళ్లెం వేసేందుకు 5జీ పరికరాలపై నిషేధం విధించే అంశంపై మంత్రులు కీలక విషయాలను చర్చించారని కేంద్రవర్గాలు తెలిపాయి.
 
వాస్తవానికి 5జీ స్పెక్ట్రమ్ వేలం ఎప్పుడో జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్, వొడాఫోన్, ఐడియా వంటి టెలికాం సంస్థల ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో ఆ వేలం కాస్తా ఏడాది వాయిదా పడింది. ఇక ఈ 5జీ వ్యవహారంలో హువేయి కీలకం కానుంది. ఇప్పటికే ఈ సంస్థపై అమెరికాలో నిషేధం కొనసాగుతోంది.
 
ఇప్పటికే కేంద్రం 4జీకి సంబంధించి చైనా పరికరాలు వాడొద్దంటూ బీసీసీఐకి ఆదేశాలు ఇచ్చింది. దీనితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి త్వరలోనే మరో సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.