శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (14:08 IST)

చీమల #TeamEffort అదిరింది.. అప్పుడేమో సైనికులు.. ఇప్పుడేమో చీమలు.. (వీడియో)

చీమల్లో ఐకమత్యం బాగా కనిపిస్తుంది. గతంలో గంగానదిలో వరదలు వచ్చినప్పుడు భారత సైనికులు వంతెనలా మారి ప్రజలను రక్షించిన ఫోటోలు నెట్టింటిని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్మీపై జనాలు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం ఇదే తరహాలో చీమలన్నీ ఒక రాయి నుంచి మరో రాయిని దాటేందుకు వంతెనలా మారాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
చీమలు ఐక్యమత్యానికి మారుపేరు. అవి ఏ పనిచేసినా అన్నీ కూడగట్టుకొని చేస్తాయి. ఎంతో శ్రమిస్తాయి. కష్ట జీవులుగా వాటికి పేరుంది. తాజాగా టీమ్ వర్క్‌తో అద్భుతాన్ని సృష్టించాయి. మహిళా రక్షణ కోసం అహరహం శ్రమిస్తున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతీ లక్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
14 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో చీమలన్నీ కలిసి వంతెనగా మారిపోయాయి. ఇతర చీమలు. ఆ చీమలపై నుంచీ దాటుకుంటూ వెళ్తున్నాయి. స్వాతి లక్రాకు ఉన్న 48 వేల మంది షాలోయర్లు దీన్ని చూసి చీమల్ని మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. అలాగే తెగ షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకు లైకులు, వ్యూస్ అమాంతం పెరుగుతున్నాయి.