1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (20:40 IST)

బిపిన్ రావత్ చితాభస్మం నిమజ్జనం: 'అమర్ రహే' నినాదాలతో?

తమిళనాడులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ చితాభస్మాన్ని హరిద్వార్‌లోని పవిత్ర గంగాజలాల్లో శనివారంనాడు నిమజ్జనం చేశారు.
 
బిపిన్ రావత్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఢిల్లీలోని బ్రార్ స్వ్రేర్ క్రిమిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలైన క్రితిక, తరణి శనివారం ఉదయం సేకరించారు. అనంతరం హరిద్వార్‌లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ప్రజలు హాజరై 'అమర్ రహే' నినాదాలతో హోరెత్తించారు.