కెనెడాలో సరికొత్త వైరస్ : పసుపు రంగులోకి మారిన నాలుక
కరోనా వైరస్ పుణ్యమాని ప్రపంచంలో సరికొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే పలు రాకాలైన వైరస్‌లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ సోకితే నాలుక పసుపు రంగులోకి మారిపోతుంది. ఈ వైరస్ పేరు ఎఫ్ స్టైన్ బార్. కెనడాలో వెలుగు చూసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, కెనడాకు చెందిన 12 యేళ్ల బాలుడుని నాలుక పసుపు పచ్చగా మారిపోయింది. అలాగే, బొంగురు గొంతు, ఎర్రటి మూత్రం, కడుపు నొప్పి, చర్మం వాడిపోవడం వంటి సమస్యలు ఉండడంతో సిక్ చిల్డ్రెన్ ఫర్ టొరంటో అనే ఆసుపత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు.
అతడిని చూసిన వైద్యులు.. తొలుత కామెర్లు అనుకున్నారు. అయితే, నాలుక పచ్చగా మారడం చూసి.. మరిన్ని పరీక్షలు చేయించారు. రక్తహీనత ఉందని నిర్ధారించారు. దానితో పాటు పిల్లలకు సాధారణంగా వ్యాపించే ఎప్ స్టైన్ బార్ వైరస్ ఇన్ ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారు. నాలుక పసుపుగా మారడం, మూత్రం ఎర్రగా మారడం అనేది ఎర్ర రక్తకణాలను మన రోగనిరోధక వ్యవస్థ చంపేసే అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు తేల్చారు.
దాంతో పాటు మంచి చేసే ఎర్ర రక్తకణాలను చంపేసే కోల్డ్ అగ్లుటినిన్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నట్టు తేల్చారు. శీతల వాతావరణం వల్ల ఈ జబ్బు వస్తుందని చెబుతున్న వైద్యులు.. ఈ బాలుడి విషయంలో మాత్రం ఎప్ స్టైన్ బార్ వైరస్ వల్లే వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.