ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (22:58 IST)

పీపీఈ కిట్లు ధరించి పెళ్లి చేసుకున్న వధూవరులు

లాక్‌డౌన్‌ కారణంగా వధువు, వరుడు ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాల్సి రావడంతో.. సెల్‌లో వీడియోకాల్‌లో వధువును చూస్తూ సెల్‌కే తాళికట్టిన ఉదంతాల్ని చూశాము. అయితే తాజాగా పీపీఈ కిట్లు ధరించి వివాహం చేసుకున్న ఘటన రాజస్థాన్‌లోని షాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

వధువుకు పెళ్లిరోజే కరోనా పాజిటివ్‌ అని పరీక్షల్లో తేలింది. దీంతో పెళ్లి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా ముందుగా అనుకున్న సమయానికే జరపాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. కాగా వధూవరులకు, పురోహితుడు, అతిధులందరి కోసం పీపీఈ కిట్లను తెప్పించారు. వధూవరులతో పాటు వివాహానికి హాజరైనవారంతా పీపీఈ కిట్లను ధరించారు.

పురోహితుడు సైతం పీపీఈ కిట్‌ ధరించి వధూవరులకు సూచలిస్తూ పెళ్లి తంతు జరిపించేశారు. వరుడు తన చేతికి తొడుగులతోపాటు పీపీఈ కిట్‌ వేసుకొని తలపాగా ధరించగా... వధువు పీపీఈ కిట్‌తోపాటు ఫేస్‌ షీల్డు, చేతికి గ్లౌజులు ధరించి పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పెళ్లిని కరోనా పెళ్లిగా అతిథులు అభివర్ణించారు.