గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (09:46 IST)

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై అత్యాచారం కేసు..!!

bs yaddyurappa
భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత, కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై అత్యాచార కేసు నమోదైంది. 17 యేళ్ల మైనర్ బాలిక, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగుళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం, ఐపీఎస్ 354 (ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం ఫిబ్రవరి రెండో తేదీన ఈ ఘటన జరిగింది. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి సాయం కోసం వెళితే అత్యాచారానికి పాల్పడ్డారని తల్లీ కుమార్తెలిద్దరూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
 
కాగా, కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప 2008-11 మధ్యకాలంలో కొన్నిసార్లు, 2018 మే నెలల కొంతకాలం, 2019-21 మధ్య కాలంలో మరికొంతకాలం ముఖ్యమంత్రిగా పని చేసారు. ఆ తర్వాత ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఆయన తన పదవికి రాజీనామా చేసారు. మరోవైపు, త్వరలో జరుగనున్న లోక్‌‍సభ ఎన్నికల్లో యడ్యూరప్ప బొమ్మై హవేరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.