గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (09:41 IST)

చెన్నై నగరంలో రూ.5వేల కోట్లతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్-నితిన్ గడ్కరీ

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 5వేల కోట్ల రూపాయలతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. చెన్నై ఓడరేవు నుంచి వివిధ ప్రాంతాలను కలుపుతూ ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేలా డబుల్ డెక్కర్ వంతెన నిర్మిస్తామని మంత్రి చెప్పారు. 
 
ఈ వంతెన నిర్మాణంతో రాబోయే 25 ఏళ్ల పాటు ట్రాఫిక్ సమస్యలుండవని మంత్రి పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణానికి రూ.3100 కోట్లు కాగా దాని వ్యయం 5వేల కోట్లకు పెరిగింది. చెన్నై- బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు కోసం భూసేకరణ పనులు పూర్తి చేశామని మంత్రి వివరించారు.
 
చెన్నై- బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి గడ్కరీ తెలిపారు. కేంద్రమంత్రి కె. పళనీస్వామితో కలిసి వంతెన గురించి చర్చించారు. నాలుగు లైన్లతో కూడిన వంతెన డిజైన్‌ను అంతర్జాతీయ నిపుణులతో రూపొందించామని మంత్రి చెప్పారు.