శనివారం, 4 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2025 (13:27 IST)

Heart attack: హార్ట్ డాక్టర్‌కే హార్ట్ ఎటాక్.. ఆస్పత్రిలోనే చెన్నై వైద్యుడు మృతి

Heart Attack
తమిళనాడు రాజధాని చెన్నైలో విషాదం నెలకొంది. చెన్నైలోని సవితా మెడికల్ కాలేజీలో కార్డియాక్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్(39) విధుల్లో ఉండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన తోటి డాక్టర్లు, వైద్య సిబ్బంది డాక్టర్ గ్రాడ్లిక్ రాయ్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన గత బుధవారం జరిగింది. 
 
డాక్టర్ రోజూలాగే డ్యూటీలో పేషంట్లను పరిశీలిస్తున్న రౌండ్స్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. తోటి డాక్టర్లు వెంటనే స్పందించి సీపీఆర్, స్టెంటింగ్, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్ వంటి చికిత్సలు అందించారు. 
 
కానీ ఎడమ ప్రధాన ధమని పూర్తిగా మూసుకుపోవడం వల్ల తీవ్రంతో హార్ట్ అటాక్ వచ్చింది. దాని నుంచి కోలుకోవడం సాధ్యం కాలేదని వైద్యులు తెలిపారు.