సీఎం చంద్రబాబు ప్రచారం ఎఫెక్ట్ - ఆ స్థానంలో 32 యేళ్ల తర్వాత బీజేపీ విజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని ఎన్డీయే కూటమి తరపున బీజేపీకి ప్రచారం చేశారు. ఫలితంగా షహదరాలో బీజేపీ అభ్యర్థి 32 యేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక్కడ 1993లో తొలిసారి బీజేపీ అభ్యర్థి రామ్ నివాస్ గోయల్ గెలుపొందారు. ఆ తర్వాత 1998, 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2013లో శిరోమణి అకాలీదళ్, 2015, 2020లో ఆప్ అభ్యర్థులు గెలుపొందారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన షహదరాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థఇ సంజయ్ గోయల్ పోటీ చేశారు. ఆయనకు మద్దతుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో గోయల్ 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో 32 యేళ్ల తర్వాత బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.