ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మే 2020 (21:11 IST)

కరోనా పేషెంట్లకు వీడియో కాలింగ్.. పశ్చిమబెంగాల్‌లో 11మంది మృతి

కరోనా పేషెంట్లకు వీడియో కాలింగ్ సదుపాయం కల్పించినట్లు గుజరాత్ సమాచార శాఖ తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వీడియో కాలింగ్ సదుపాయం కల్పించింది. కరోనా వ్యాధి సోకిన వారిని వారి కుటుంబ సభ్యులతో అనుసంధానం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇకపోతే.. వీడియో కాలింగ్ సదుపాయం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
 
ఇదిలా ఉంటే.. పశ్చిమబెంగాల్‌లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజు బెంగాల్లో 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 61కి చేరింది. 
 
ఇక కేసుల విషయానికి వస్తే సోమవారం ఒక్కరోజే 61 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1259కి చేరాయి. పశ్చిమబెంగాల్‌ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హా ఈ వివరాలను వెల్లడించారు.