ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (16:59 IST)

కరోనా ఎఫెక్ట్.. రేపు రైల్వేకు బ్రేక్

దేశంలో విజృంభిస్తోన్న కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తలపెట్టిన జనతా కర్ఫ్యూ రోజున రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది. కర్ఫ్యూలో భాగంగా పాసింజర్ రైళ్లతో పాటు పలు నగరాల్లో బస్సు, మెట్రో సేవలు కూడా రద్దు కానున్నాయి.

కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ఆదివారం చేపట్టనున్న జనతా కర్ఫ్యూలో భాగంగా రైళ్లు నిలిచిపోనున్నాయి. ఏ పాసింజర్‌ రైలు కూడా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు బయల్దేరబోదని రైల్వేశాఖ స్పష్టంచేసింది. ఫలితంగా సుమారు 2,400 సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పటికే ప్రయాణంలో ఉన్న రైళ్లు మాత్రం గమ్యస్థానం చేరే వరకు అనుమతిస్తారు.

దిల్లీ, ముంబయి, కోల్‌కతా, సికింద్రాబాద్‌ సబర్బన్‌ రైలు సర్వీసులు పరిమితంగానే సేవలు అందించనున్నాయి.  కాగా ఆదివారం చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 64 ఎక్స్ప్రెస్ రైళ్లు, చెన్నై మీదుగా వెళ్లే రైళ్లను సైతం రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.