గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (19:32 IST)

నీ భార్య నాకు.. నా భర్త నీకు.. ఆన్‌‍లైన్‌లో కొత్త కల్చర్.. చెన్నై ఈసీఆర్‌లో?

నీ భార్య నాకు.. నా భర్త నీకు.. అంటూ ఆన్‌‍లైన్‌లో కొత్త కల్చర్ వైరల్ అవుతోంది. ఈ కల్చర్‌కు మీవీ అనే పేరు పెట్టేశారు. వివాహితులు తమ తమ భాగస్వాములను మార్చుకునే కల్చన్ తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. చెన్నై ఈసీఆర్‌లో భారీగా రెసార్టులున్న సంగతి తెలిసిందే. ఈ రెస్టారెంట్లకు ధనవంతులు కాలక్షేపం కోసం వస్తూపోతూవుంటారు.
 
అలాంటి వారు ప్రస్తుతం కొత్త కల్చర్‌కు తెరలేపారు. అదే మి.వి కల్చర్. చెన్నైకి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఈ డేటింగ్ కల్చర్‌ను చెన్నైలో పరిచయం చేశాడని తెలుస్తోంది. వివాహితులైన దంపతులు వారి వారికి నచ్చిన వ్యక్తులతో డేటింగ్‌కు వెళ్లడం ఈ కల్చర్ ప్రధాన అంశం. ఇదంతా ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది. భారీ బడ్జెట్‌తో కూడిన రెస్టారెంట్లలో ఈ కల్చర్ అమలులో వుంది.
 
ఇంకా అక్కడ ఈ కల్చర్‌లో పాలుపంచుకున్న వివాహితుల వీడియోలు చూపెట్టం జరుగుతోంది. ఆపై ఈ కల్చర్ నచ్చిన వారు.. ఆన్‌లైన్ డేటింగ్‌కు మొగ్గుచూపుతున్నారు. ఇందుకోసం.. డ్రింక్స్, డిస్కోలను కూడా రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఢిల్లీ, ముంబైకి తర్వాత ఈ కల్చర్ చెన్నైలో కాలుమోపింది. ఈ కల్చర్‌కు అడ్డుకట్ట వేయాలని... సామాజికవేత్తలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.