కాంగ్రెస్ 70 ఏళ్లుగా ఈవీఎంలను హ్యాక్ చేస్తుందిగా.. మేం చేస్తే తప్పేంటి? ఢిల్లీ సీఎం
గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను హ్యాక్ చేస్తూనే ఉంది కదా.. అప్పుడు ఎవరికీ తప్పుగా అనిపించలేదు. ఇప్పుడు మేము చేస్తే మాత్రం తప్పుగా కనిపిస్తోంది.. అంటూ ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవి రాజకీయాల్లో పెను దుమారానికి దారితీశాయి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
ఇంకా 13 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ సీఎం ఏం చెబుతున్నారో చూడండి.. అనే కామెంట్లు కూడా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. అయితే ఫ్యాక్ట్ చెక్‌లో అసలు విషయం ఏంటో వెల్లడి అయ్యింది.
కేజ్రీవాల్ పోస్ట్ చేసింది కేవలం కత్తిరించిన వీడియో అని.. పూర్తి ఇంటర్వ్యూ చూడాలంటూ అసలు వీడియోను బయటపెట్టాయి. అయితే ఆ పూర్తి వీడియోలో కూడా రేఖా గుప్తా అవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.