గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (13:27 IST)

యూపీ కృష్ణుడి ఆలయం.. ఏసీ నీటిని తీర్థం అనుకుని కప్పుల్లో పట్టుకుని? (Video)

image
సాధారణంగా గుడికి వెళ్తే తీర్థం పుచ్చుకోవడం ఆనవాయితీ. అయితే యూపీలోని ఓ దేవాలయంలో భక్తులు ఓవరాక్షన్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూపీలోని వ్రిందావన్ నగరంలోని శ్రీకృష్ణుని ఆలయంలో.. భక్తులు దర్శనం అనంతరం గుడి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతుండే నీటిని తాగారు. 
 
 
ఇదేదో తీర్థం, పవిత్ర జలం అనుకుని టీ కప్పుల్లో పట్టుకుని మరీ భక్తులు తాగుతున్నారు. ఇంకా నెత్తిపై చల్లు కుంటున్నారు. అయితే ఈ నీళ్లు కృష్ణుడి ఆలయ తీర్థం కాదని.. ఏసీ నుంచి వచ్చే నీళ్లని ఓ వ్యక్తి వీడియో తీస్తూ తెలిపాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.