బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:33 IST)

వ్యాధి నిరోధకత ఎలా పెంచుకోవాలో తెలుసా?

వ్యాధి నిరోధక శక్తి బాగా వున్నవారిని కరోనా ఏమీ చేయలేదని వైద్యులు చెబుతున్నారు. కరోనా కష్టకాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొంచుకోవాలంటే విటమిన్లు, ప్రోటీన్లతో కూడిన బలవర్థక ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఆహారనిపుణులు సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారి వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో అందరిలోనూ ఒకటే ఆలోచన. ఈ మహమ్మారి నుంచి మనల్ని, మన ప్రియమైన వారిని కాపాడుకోవడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి సమాచారం కోసం దినపత్రికలను తిరగేస్తున్నారు.

మహమ్మారి బారిన పడకుండా... వైరస్‌ బాధితులకు దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, సామాజిక దూరాన్ని పాటించడంతోపాటు వ్యాధి నిరోధక శక్తి(ఇమ్యూనిటీ)ని కలిగి ఉండటమూ అత్యంత కీలకమేనని అకాడమీ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డయటెటిక్స్‌(అమెరికా)కు చెందిన ఆహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విటమిన్లు, ప్రోటీన్లతో కూడిన బలవర్థక ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.