శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (13:54 IST)

బార్‌లో పూటుగా మందుకొట్టిన కోతి ఏం చేసిందంటే? (video)

బెంగళూరులోని ఓ కోతి బార్‌లో మందు కొట్టింది. పూటుగా తాగి.. బార్‌లో వున్నవారందరినీ తరుముకుంది. కోతి చేష్టలకు భయపడి.. మందుబాబులు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కమ్మనహళ్లిలోని దివాకర్ బ

బెంగళూరులోని ఓ కోతి బార్‌లో మందు కొట్టింది. పూటుగా తాగి.. బార్‌లో వున్నవారందరినీ తరుముకుంది. కోతి చేష్టలకు భయపడి.. మందుబాబులు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కమ్మనహళ్లిలోని దివాకర్ బార్‌లో ఓ వానరం మందుకు బాగా అలవాటు పడింది. 
 
మనిషి మందు తాగితేనే కోతిలా ప్రవర్తిస్తారని చెప్తుంటాం. అదే కోతి మందు తాగితే పరిస్థితి ఎలా వుంటుందో అక్కడుండే వారికి బాగా అర్థమైంది. ప్రతిరోజూ వచ్చి మనుషులు తాగడంతో మిగిలిపోయిన మద్యాన్ని తాగుతూ వచ్చిన కోతి.. పీకలదాకా తాగేసి నానా హంగామా చేసింది. 
 
అక్కడున్న వారి వెంట పడుతూ.. పరుగులు పెట్టించింది. కొందరు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు మందుబాబులకు చుక్కలు చూపిన కోతిని ఓ వ్యక్తి పట్టుకున్నాడు.