గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (08:58 IST)

పార్లమెంట్ అనెక్స్ భవనంలో అగ్నిప్రమాదం...

ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఒక్కసారిగా హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఆరో అంతస్తులో వచ్చాయి. దీంతో హుటాహుటిన ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకుని... మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. 
 
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని, అయినా... దర్యాప్తు ప్రారంభిస్తామని అధికారులు స్పష్టంచేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.