సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (12:40 IST)

6వ సారి పెళ్లి చేసుకోబోయిన మాజీ మంత్రి అరెస్టు, మూడో భార్య నగ్మ ఫిర్యాదుతో...

ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి చౌధరి బషిర్ 6వ సారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే మూడో భార్య ఫిర్యాదుతో అతడి బండారం బయటపడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ పెళ్లిని ఆపడంతో పాటు సదరు మంత్రిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. 
 
సదరు మంత్రి యూపీలోని ప్రముఖ రాజకీయ పక్షం సమాజ్ వాదీ పార్టీ నేత. భార్య నగ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగ్మ ఫిర్యాదుతో పెళ్లిని అడ్డుకుని బషిర్‌పై కేసు నమోదు చేశారు. ముస్లిం మహిళా వివాహ చట్టం 2019 సెక్షన్ 3 ప్రకారం, అలాగే ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
 
బషీర్ మూడో భార్య నగ్మ మాట్లాడుతూ.. గత నెల 23న తనకు షైస్ట అనే అమ్మాయిని బషీర్ 6వ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసిందని, తాను ఆ పెళ్లిని వ్యతిరేకించడంతో తనను దుర్భాషలాడి దారుణంగా హించారని ఆరోపించారు. అంతేకాకుండా త్రిపుల్ తలాక్ విధానంలో విడాకులు కూడా ఇచ్చి ఇంటి నుంచి గెంటేశారని చెప్పారు.