గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జులై 2020 (12:34 IST)

గ్యాస్ ధరల పెంపు

ఇన్నాళ్లూ పెట్రో ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరిచిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు గ్యాస్ ధరలను ఆకాశానికి ఎత్తే పనిలో పడింది. బుధవారం (జూలై1) అమల్లోకి వచ్చేలా మెట్రో నగరాల్లో  సిలిండర్‌కు 4.50 రూపాయలకు వరకు పెంచారు.

ఎల్‌పీజీ సిలిండర్ల ధరను వరుసగా రెండవ నెలలోనూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ పై ఢిల్లీలో ఒక రూపాయి, ముంబైలో 3 రూపాయల 50 పైసలు , కోల్‌కతాలో  4.50 రూపాయలు, చెన్నైలో 4 రూపాయలు, హైదరాబాద్ లో 4.50 రూపాయలు చొప్పున  పెరిగింది.