ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

తమిళనాడుకు ఏం పనిమీద బిపిన్ రావత్ వెళ్లారు?

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి వద్ద బుధవారం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో దేశంలో అత్యంత శక్తిమంతమైన సైనాకాధిరిగా గుర్తింపు పొందిన, భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌లు మృతి చెందారు. వీరితో పాటు మరో 11 మంది రక్షణ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఢిల్లీ నుంచి తమిళనాడు రాష్ట్రానికి బిపిన్ రావత్ తన అర్థాంగితో కలిసి ఎందుకు వెళ్ళారు అనేది ఇపుడు తెలుసుకుందాం. 
 
దేశంలో అత్యుతున్నత సైనిక పదవిలో ఉన్న బిపిన్ రావత్... నీలగిరి జిల్లా కున్నూరులో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఈ కాలేజీలో ఆయన విద్యాభ్యాసం చేశారు. ఈ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించేందుకు వెళ్లారు. 
 
ఢిల్లీ నుంచి 9 మంది బృందంతో ఆయన నీలగిరి జిల్లా కున్నూరులోని సూలూరు ఎయిర్ బేస్‌కు వెళ్లారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో వెల్లింగ్టన్‌కు అత్యాధునిక ఎంఐ17వి5 ప్యాసింజర్ హెలికాఫ్టర్‌లు బయలుదేరారు. హెలికాఫ్టర్ బయలుదేరిన 10 నిమిషాల్లోనే ఘోర విపత్తు సంభవించింది. కాట్టేరి అటవీ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. దీంతో ఘోర విపత్తు సంభవించింది. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించిన బిపిన్ రావత్ ప్రాథమిక, మాధ్యమిక విద్యను డెహ్రాడూన్, సిమ్లాల్లో పూర్తి చేశారు. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో సీటు సంపాదించి అక్కడ నుంచి అంచలంచెలుగా త్రివిధ దళాధిపతి స్థాయికి ఎదిగారు.