శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 29 ఆగస్టు 2017 (13:30 IST)

ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు... 120 మి.మీ వర్షం... రైల్వే లైన్లపై పడవలు

ముంబై మహా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24 గంటలుగా ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా 120 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

భారీ వర్షాల  కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థకు కూడా నష్టం వాటిల్లింది. ఇక రైలు, రోడ్డు మార్గాలు జలాశయాలను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులను పడవల ద్వారా చేరవేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మరో 48 గంటల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు పంపింది.