ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (13:59 IST)

అరవింద్ స్వామికి చుక్కలు చూపించిన గాయత్రి.. వెన్నెముక విరిగితే పక్కకు కూడా రాలేదట..

అందాల హీరో అరవింద్ స్వామికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. అప్పట్లో అమ్మాయిలంతా అరవింద్ స్వామి లాంటి భర్త కావాలని కోరుకునే వారు. అయితే అరవింద్ స్వామి వివాహ జీవితాన్ని మాత్రం ఓ హీరోయిన్ నాశనం చేసింది.

అందాల హీరో అరవింద్ స్వామికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. అప్పట్లో అమ్మాయిలంతా అరవింద్ స్వామి లాంటి భర్త కావాలని కోరుకునే వారు. అయితే అరవింద్ స్వామి వివాహ జీవితాన్ని మాత్రం ఓ హీరోయిన్ నాశనం చేసింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో అదరగొడుతున్న అరవింద్ స్వామి వివాహ జీవితం హాట్ టాపిక్ అయ్యింది. 90టీస్‌లో అరవింద్ స్వామికిక వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 
 
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న దళపతి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ పాత్రకు ముందు నాగార్జునను అనుకున్నా.. ఆయన ఆ పాత్రను వదులుకోవడంతో 20 ఏళ్ళ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ స్వామిని చూసి మణిరత్నం ఓకే చేశారు. అంతే అందగాడి దశ తిరిగింది.  ఆపై రోజా ముంబై వంటి హిట్ సినిమాలతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో పెద్ద స్టార్ అవుతాడని అందరూ అంచనా వేశారు. కాని సినిమాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులకు గురయ్యాడు. సినిమాల్లోకి వచ్చాక అరవింద్ స్వామి గాయత్రి రామమూర్తిని పెళ్ళి చేసుకున్నాడు. 
 
ఈమె అరవింద్  స్వామికి చుక్కలు చూపించిందట. ఈ దంపతులకు ఇద్దరు సంతానం కలిగినా.. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయట. ఓ వైపు బిజినెస్, మరోవైపు సినిమాలతో గడిపే అరవింద్ స్వామి భార్యాపిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయించే వారు కాదని.. అందుకే గాయత్రి ఆయనకు దూరమైందని అప్పట్లో ప్రచారం సాగింది. దీంతో ఆయన చాలా కుంగి పోయారట. అసలుకే మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న అరవింద్ స్వామికి తర్వాత ఓ ప్రమాదంలో వెన్నెముక విరిగిపోయింది. 
 
ఆ సమయంలో కూడా గాయత్రి అరవింద్ స్వామి దగ్గరకు రాలేదు. కనీసం పిల్లల్ని కూడా చూడనివ్వలేదు. ఆ సమయంలోనే అపర్ణ ముఖర్జీని అరవింద్ స్వామి వివాహం చేసుకున్నాడు. పిల్లల భవిష్యత్తు కోసం తాను అన్నింటికీ సిద్ధమని.. వారు ఉన్నత స్థాయికి ఎదగాలని అరవింద్ స్వామి ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం అరవింద్ స్వామి వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణిస్తున్న హీరో నేపథ్యం ఏమిటనే దానిపై నెటిజన్లు సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారు.